Monday, May 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ ఆ రెవెన్యూ కార్యాలయం

కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ ఆ రెవెన్యూ కార్యాలయం

పైసలిస్తేనే ఫైల్ కదిలే వైనం.. లేకపోత,.. నో …నో…
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న సిబ్బంది…

విశాలాంధ్ర : చిలమత్తూరు : మండల కేంద్రంలోని ఆ రెవెన్యూ కార్యాలయం కరప్షన్కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది, పైసలిస్తేనే ఫైల్ కదిలే వైనం, లేకపోతే నో …నో అంటు, సామాన్యులకు చుక్కలు చూపుతున్న తతంగం నెలకొంది. గత ప్రభుత్వ హయాం నుండి ఇష్టారాజ్యముగా వన్ బి లు రికార్డుల్లో చేర్పులు మార్పులు తారుమారు చేసి సామాన్యులకు పలు రకాలుగా ఇబ్బందులకు గురయ్యాల చేస్తున్నారు, మండలంలో 84 గ్రామంలో ఎక్కడ పోయిన రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా వినిపిస్తాయి, ఈ నేపథ్యంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినను రైతుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయినాయి, మండల వ్యాప్తంగా రాను రాను భూముల విలువలు పెరగడంతో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను రెవెన్యూ కార్యాలయంలో కొంతమంది క్రింది స్థాయి, వీఆర్వో స్థాయి అధికారుల వరకు పలువురు రియాల్టర్లకు నాయకులకు అండగా వ్యవహరిస్తూ తొత్తులుగా నిలబడి రికార్డులు సైతం తీసుకొని జిరాక్సులు చేసుకొని, కుంటలు, చెరువులు, గోకాడ భూములు, వంక పోరంబోకులు, నిరుపేదల భూములను, పలుచోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ తగిన కాటికి తెగనమ్మి పలువురిని ఇరకాటములో పెట్టేసి సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, మరికొందరు అధికారులు లోలోపల రియాల్టర్లకు కావలసినన్ని రికార్డులు అందిస్తూ మర్యాదలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు, మండలంలో అసైన్మెంట్ భూములను గుర్తించి వారికి అనుకూలంగా ఉన్న వారి పేరుపై మార్చడం చేస్తున్నారు, పైసలిస్తే చాలు చేర్పులు మార్పులు చేసేసి, గ్రామాలలో కలహాలు పెట్టిన సంఘటనలు కూడా లేకపోలేదు, దీంతో ప్రతిరోజు రెవిన్యూ, పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ రైతులు విసుగెత్తి పోతున్నారు. గతంలో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యముగా వ్యవహరిస్తూ తహసిల్దార్లు ,వీఆర్వోలు పూర్తిస్థాయిలో సహకరించడంతో అడ్మినిస్ట్రేషన్ తప్పుదోవ పట్టిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి, దీంతో ఆ రెవెన్యూ కార్యాలయంలో కరప్షన్ శివతాండవమే జరుగుతుందని తెలుస్తుంది, కావున సంబంధిత అధికారులు ఎమ్మెల్యే బాలయ్య, ఈ మండలం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూము లు ఆక్రమణలకు గురి కాకుండా, ఇప్పటికే అయిన వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు, పేద ప్రజలకు రెవిన్యూ సమస్యల నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది, ఏది ఏమైనప్పటికీ ఈ మండలంపై సంబంధిత అధికారులు ఎమ్మెల్యే బాలయ్య తీరు ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు