విశాలాంధ్ర ధర్మవరం;; మాతృభూమి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం సేవలు చేయడమే సైనిక దినోత్సవం యొక్క లక్ష్యము అని ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్క్ సంఘమ అధ్యక్షులు కృష్ణమూర్తి కార్యదర్శి గుద్ధిటి శ్రీనివాసులు, కోశాధికారి కుమార్ స్వామి, గౌరవ అధ్యక్షులు చెన్నా ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సైనిక దినోత్సవం సందర్భంగా పట్టణములోని ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్కు వద్ద భారతీయ సైనిక 77వ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా దేశం కోసం విశేష సేవలు అందిస్తూ ప్రాణాలు అర్పించిన సైనికులందరికీ కూడా వారు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తొలుత వీర మరణం పొందిన స్థూపం కు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశంలో భారతదేశాన్ని మాతృభూమిగా తలచి, భారతదేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంచు కొండల్లో, మహాసముద్రంలో, అనంత నీలి గగనంలో దేశ రక్షణ బాధ్యతలను నేడు జవాన్లు నెరవేస్తున్నారని తెలిపారు. వీరి సేవలకు ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని, వారిని స్మరిస్తూ దేశ అభివృద్ధికి మనమందరము కృషి చేయాలని తెలిపారు. అనుక్షణం దేశ సేవలో ఉంటూ దేశ ప్రజలను దేశాన్ని కాపాడటానికి వారి జీవితాలను త్యాగం చేసిన సైనికులకు మనం వందనాలు కృతజ్ఞతలతో కూడిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గుప్తా, నాగభూషణ, మారుతీ తదితరులు పాల్గొన్నారు.
దేశం కోసం సేవలు చేయడమే సైనిక దినోత్సవం లక్ష్యం… కృష్ణమూర్తి
RELATED ARTICLES