అధ్యక్ష, కార్యదర్శులు జయసింహ, నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం : పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని క్లబ్ అధ్యక్షుడు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్త తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల తొమ్మిదవ తేదీ ఆదివారం నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు
అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం 9వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుందని, చిబీర దాతలుగా కీర్తిశేషులు చిందలూరు సత్యనారాయణ, భార్య కీర్తిశేషులు పద్మావతమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్ళు (సత్య కృప సిల్క్స్ హౌస్-ధర్మవరం) వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఈ హెచ్ ఎస్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదని తెలిపారు. కేవలం ఆధార్ కార్డు, సెల్ఫోన్తో కూడిన చిరునామా ఉంటే చాలు అని తెలిపారు. అదేవిధంగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకుని తగ్గించుకొని వచ్చిన యెడల వైద్య చికిత్సలను అందిస్తామని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు, ఉచిత భోజనం, ఉచిత ఆపరేషన్, ఉచిత రవాణా సౌకర్యం,ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ సమాచారాన్ని ప్రజలందరూ కూడా మీకు తెలిసిన వారికి, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్న శేఖర్ రెడ్డి, హరినాథ్, రామకృష్ణ, సత్రశాల ప్రసన్నకుమార్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యం..
RELATED ARTICLES