టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం గౌడ్
విశాలాంధ్ర ధర్మవరం:: పేదరికం లేని సమాజమును తయారు చేయడమే పి-4 సర్వే యొక్క లక్ష్యము అని టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం గౌడ్ 25వ వార్డు టిడిపి ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా 25 వ వార్డు సచివాలయ ఉద్యోగులకు పి-4 యాప్ ద్వారా నమోదు చేసిన సర్వే పూర్తి చేసుకున్న వార్డు సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి చేసిన సర్వే నిర్వహణలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని, పేదవారిని ఆర్థిక సామాజిక రంగాల్లో తీసుకొచ్చే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పేదలను ధనికులను భాగస్వామ్యం చేసేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంకనూ ఈ సర్వే చేయించుకోని వారు ఉంటే వెంటనే చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీమల రామాంజి, మాధవరెడ్డి, బిజెపి నాయకులు శారదమ్మ, జనసేన నాయకులు కోలా నాగార్జున, మల్లన్న, అఖిల్ ,సచివాలయ సిబ్బంది ,సాయి ప్రకాష్, పుష్పరాజ్, ఉమాదేవి, నరేంద్ర, సరిత ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
పేదరికం లేని సమాజం చేయడమే పి-4 సర్వే లక్ష్యం..
RELATED ARTICLES