విశాలాంధ్ర ధర్మవరం; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ఉమ్మడి అనంతపురం జట్టు విజయం సాధించింది. “ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్” ఆధ్వర్యంలో ఉప్పలగుప్పం మండలం సూరసేన యానాం లో రెండు రోజుల పాటు నిర్వహించిన ” బీచ్ వాలీబాల్ టోర్నమెంట్” విజేతలకు ఆదివారం ఉదయం బహుమతి ప్రదానం నిర్వహించారు. టోర్నమెంట్ లో 13 జిల్లాల పాత్రికేయులజట్లు పోటీలో పాల్గొన్నాయి. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో వైజాగ్ జట్టుతో 10-20తో ,క్వార్టర్ ఫైనల్ లో నెల్లూరు తో 7-20 తో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పశ్చిమగోదావరి తో అనంతపురం తలపడగా 5-20తో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. ఈ బీచ్ వాలీబాల్ క్రీడలో పాత్రికేయులు కేసాని రామకృష్ణ, నరసింహులు, శిరిగినేని కేశవ, మురళి, రాము, సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్నారు. వృత్తిపరంగా నిత్యం ఒత్తిడిలో జీవించే జర్నలిస్టుల కోసం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందినీయమని తెలిపారు. అనంతరం విజేతలకు ఎమ్మెల్యే సీల్డ్ ను అందజేశారు.
యానం “బీచ్ వాలీబాల్” టోర్నమెంట్ లో ఘనవిజయం సాధించిన అనంతపురం జట్టు
RELATED ARTICLES