Friday, April 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అమోదం సరైనది కాదు

వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అమోదం సరైనది కాదు

డిఆర్ఓ మాలోల కు వినతి పత్రం అందజేసిన యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ

విశాలాంధ్ర అనంతపురం : వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అమోదం సరైనది కాదని డి ఆర్ ఓ మాలోల కు వినతి పత్రాన్ని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సి. జాఫర్ అందజేశారు. వక్స్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అమోదం సరైనది కాదని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సి జాఫర్ మాట్లాడుతూ… మేము భారత పౌరులుగా, ఇస్లాం మరియు ఇస్లామిక్ చట్టంపై మా మత విశ్వాసం మరియు విశ్వాసాన్ని ఆచరించే హక్కును భారత రాజ్యాంగం మాకు హామీ కల్పించిందన్నారు. భారతదేశంలోని బాధ్యతాయుతమైన ముస్లిం పౌరులుగా ప్రతిపాదిత ఎక్స్ సవరణ యాక్ట్ గురించి, పార్లమెంటరీ చర్చలతో పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అధికారిక వెర్షన్ నుండి కొత్త నిబంధనలను మేము జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం జరిగిందన్నారు. ఇస్లాంలో వక్స్ యొక్క ప్రాథమిక అంశాలపై లోతైన ఆలోచన తర్వాత, అన్ని కొత్త నిబంధనలు ఇస్లామిక్ వక్స్ వ్యవస్థ యొక్క విలువలు మరియు స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ యాక్ట్ ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మేయర్ వసీం , ఖాజా హుస్సేన్, అలిపిర, బంగారు భాష, కాగజ్గర్ రిజ్వాన్, నదీమ్ అహ్మద్, సైఫుల్ల బైగ్, కాజా, ఐ ఎమ్ ఎమ్ భాష, టిప్పు సుల్తాన్ జాకీర్, ముక్తియార్, వేమల నదీమ్ తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు