విశాలాంధ్ర నందిగామ :- పేద ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విడుదల చేసిన బడ్జెట్ పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది గా ఉందని ఆమె అన్నారు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా ఆమె మాట్లాడుతూ పేదల ఆశలను అభివృద్ధి వైపు మలిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ ఉందని అన్నారు అన్ని వర్గాల వారికి న్యాయం సమకూరుస్తూ ఎంతో కూర్పుతో బడ్జెట్ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని అన్నారు ప్రభుత్వ స్కూల్లో ఉచిత విద్యుత్ అందించాలనేది ఎంతో గొప్ప విప్లవాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు అభివృద్ధి సంక్షేమంతో పాటు హామీల అమలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రైతే ముందు అనే నినాదాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆచరణలో చూపించారని పేర్కొన్నారు గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తే నేటి మా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి బడ్జెట్ ద్వారా కేటాయింపుల ద్వారా అందించామని అన్నారు అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం పథకాలు బడ్జెట్ కేటాయింపులు ఓటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జల వనరుల శాఖ కు అధిక ప్రాధాన్యత అధిక కేటాయింపుల ద్వారా అందించటం జరిగిందని మొత్తం బడ్జెట్లో దాదాపు 6% ఆరోగ్యం వైద్య, విద్యా శాఖలకు కేటాయించడం జరిగిందని తెలిపారు బీసీలకు సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్లో పెద్దపేట వేశారని అలాగే ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి అభివృద్ధికి బాటలు వేశారని అభివృద్ధి పొలాలు అందరికీ అందేలా కేటాయింపులు జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు…
పేద ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి బడ్జెట్… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES