Homeతెలంగాణకావ్య మారన్‌-అనిరుధ్‌ పెళ్లి సందడి షురూ..సీఎం రేవంత్‌, కేటీఆర్‌లకు ఆహ్వానాలు!

కావ్య మారన్‌-అనిరుధ్‌ పెళ్లి సందడి షురూ..సీఎం రేవంత్‌, కేటీఆర్‌లకు ఆహ్వానాలు!

- Advertisement -

దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌, సన్‌ గ్రూప్‌ చైర్మన్‌ కళానిధి మారన్‌ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సీఈఓ కావ్య మారన్‌ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. అందిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 11న గ్రీస్‌లో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లిని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.అయితే, వివాహానికి సంబంధించిన వివరాలపై ఇరు కుటుంబాల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

సీఎం రేవంత్‌ రెడ్డికి పెళ్లి రిసెప్షన్‌ ఆహ్వానం
అయినప్పటికీ, పెళ్లి ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.తాజాగా సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌, ఆయన సతీమణి కావేరి మారన్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. నవంబర్‌ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్‌-అనిరుధ్‌ రవిచందర్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని రేవంత్‌ రెడ్డి దంపతులను ఆత్మీయంగా ఆహ్వానించారు.

కేటీఆర్‌కు కూడా ఆహ్వాన పత్రిక అందజేత
అనంతరం కళానిధి మారన్‌, కావేరి మారన్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమను కలిసి వివాహ రిసెప్షన్‌ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వాన పత్రికలు అందించడంతో కావ్య మారన్‌ వివాహ రిసెప్షన్‌ తేదీపై స్పష్టత వచ్చినట్లయింది.

నవంబర్‌ 21న చెన్నైలో ఈ విందు కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం.

మీరు
66%
శాతం పూర్తి చేశారు
వివరాలు

సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు
కావ్య మారన్‌-అనిరుధ్‌ రవిచందర్‌ వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్‌తో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

వీరందరికీ కళానిధి మారన్‌ స్వయంగా ఆహ్వానాలు అందించనున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో అనిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలతో మారన్‌ కుటుంబం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే, పెళ్లి తేదీ, వేదిక, ఇతర వివరాలపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు