ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం తాజాగా నిధులు విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ మద్ధతుతో అమరావతికి రూ.4200 కోట్లు రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు సైతం చేయూతనిచ్చింది. వేల కోట్ల నిధులను ఇప్పటికే అందించింది. ఈ విషయంపై కూటమి పార్టీల ఎంపీలు మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతికి 4200 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం
RELATED ARTICLES