-కలెక్టరేట్ మహా ధర్నాలో కార్మిక,రైతు నేతలు
విశాలాంధ్ర -అనంతపురం : కార్మిక చట్టాలను కొనసాగించాలని ,వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేసిన రైతు,కార్మిక సంఘాల నేతలు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక,రైతు సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక లలిత కళా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్టాలను తుంగలోతొక్కి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు,కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు,కనీస వేతనాలు 26 వేలుకు పెంచుతున్నామని కేంద్రం ప్రకటించినా అమలుకుమాత్రం నోచుకోవడం లేదన్నారు,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ… రైతుల నల్ల చట్టాలను రద్దు చేయాలని 13 నెలలు పాటు దేశ రాజధాని డిల్లీలో ఉద్యమం నిర్వహించి 750 మంది రైతులు ప్రాణత్యాగం చేసిన ఓక్క రైతుకు కూడా పారితోషికంగా ఓక్క రుపాయ కూడా ఇవ్వలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వలన ప్రతి ఏడాది రైతులు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారన్నారు,రైతులకు పంట రుణాలు రద్దు చేయని కేంద్ర ప్రభుత్వం గడిచిన 10 సం,,ల్లో కార్పొరేట్ కంపెనీలకు 19 లక్షల కోట్లు రద్దు చేయడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ… అసంఘటిత రంగ కార్మికులు అయిన ఆటో,హమాలీ,వీధి వ్యాపారస్తులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలన్నారు,అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు,కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా నిలుపుదల చేసే భాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంతే విధంగా ఉన్నాయన్నారు దీనిమీద ప్రభుత్వాలు చర్యలు సూన్యమని ఎద్దేవా చేశారు, విద్యుత్తు రంగానికి సంబంధించినవన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులు,ప్రజల నడ్డివిరచాలని చూస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ లు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వంతపాడుతూ కేంద్రం తానా అంటే రాష్ట్ర ప్రభుత్వం తందానా అనే పద్ధతిలో ఉందన్నారు, వెంటనే కార్మిక రైతాంగ సమస్యలు పరిష్కరించాలన్నారు,
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి నాగముత్యాలు,చేతివృత్తుల సంఘం రాష్ట్ర నాయకులు లింగమయ్య,వ్య.కా.సం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మావతి,గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు వై. ఎల్ రామాంజినేయులు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,జిల్లా కార్యదర్శులు చిరంజీవి,రాజు,ఉపాధ్యక్షులు నాగవేణి,శ్రీనివాసులు,ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,కౌలు రైతు సంఘం నాయకులు రామాంజి,మల్లయ్య, నాగేంద్రబాబు వేణుగోపాల్ శివ కృష్ణ ఎర్రప్ప ప్రసాద్ హసేన్ వెంకటేష్ భార్గవి లక్ష్మి కృష్ణా నాయక్ నాగేంద్ర సాయి తిమ్మప్ప, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, మహిళా సమైక్య నాయకులు సావిత్రమ్మ, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర,కౌల్ సంఘం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఇన్సప్ నాయకులు చాంద్ భాష,కాజా, చేతి వృత్తిదారుల జిల్లా నాయకులు హరి, నాగప్ప, శ్రీనివాసులు, మహిళా సమైక్య నగర కార్యదర్శి జానకమ్మ, హమాలీలు అక్బర్ వలి బాబు రాము అశోక్, ఏఐటియుసి సిఐటియు రైతు సంఘాలు అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.