Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేతలను దగా చేసిన కూటమి ప్రభుత్వం..

చేనేతలను దగా చేసిన కూటమి ప్రభుత్వం..

రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ
విశాలాంధ్ర -ధర్మవరం; చేనేత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్థనగ్న ప్రదర్శన ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యచ్యులు జిల్లా కార్యదర్శి బుడగ వెంకటనారాయణ మాట్లాడుతూఎన్నికల ముందు చేనేత కార్మికులకు అన్ని విధాల ఆదుకుంటామని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేస్తామని ,200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని సొసైటీలకు ఆప్కో ద్వారా ఇవ్వవలసిన బకాయిలు తీర్చడానికి నిధులు కేటాయిస్తామని, దుర్భర పరిస్థితుల్లో ఉన్న చేనేత కార్మికులకు అండగా ఉంటామని, ఉపాధి మెరుగుపరిచి అప్పుల బాధలు లేకుండా ఆదుకుంటామని అనేక వాగ్దానాలు చేసిన నారా చంద్రబాబునాయుడు నారా లోకేష్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో 2000 కోట్లు కేటాయించి ఆదుకుంటారని ఆశించిన నేతన్నలకు నిరాశ మిగిలింది అని దుయ్యబట్టారు.కేవలం 138 కోట్లు కేటాయించి ఇచ్చిన హామీలు ,విస్మరించారని,గత ప్రభుత్వం ఇచ్చిన నేతన్న నేస్తం 24 వేల రూపాయల పథకాన్ని రద్దు చేశారని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.అదేవిధంగా ప్రభుత్వం పై చేనేత కార్మికులు పెట్టుకున్న అసలు అడియాసలయ్యాయి అని వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని ,చేనేత వస్త్రాలకు రిబేట్ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ,చేనేతకార్మికులకు రెండున్నర సెంట్లు స్థలంలో వర్క్ షెడతో కూడిన ఇల్లు నిర్మించి ఇవ్వాలని ,అర్హులైన చేనేత కార్మికులకు ముద్ర రుణాలు,చేనేత పింఛన్లు ఇవ్వాలని ,చేనేత కార్మికులకు ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ. ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ధర్మవరం శాసనసభ్యులైనా మంత్రి సత్య కుమార్ యాదవ్ చేనేతల ఆత్మహత్యలు వలసల నివారణకు ,ధర్మవరంలో చేనేతలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, విజయభాస్కర్, చేనేత నాయకులు ఆదినారాయణ, శ్రీనివాసులు, శ్రీధర్,బాల రంగయ్య,కొండ, పెద్దకోట్ల గణేష్, కేశవ, రమణ, రమేష్, మల్లికార్జున, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు