ఘనంగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34 వ వర్ధంతి
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యనుమల నరేష్ ఆదేశాలు మేరకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షుడు బండారు చైతన్య, నాయకులు జబి, పవన్ తదితరులు ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక భారతదేశానికి పితామహుడు అని,40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు అని తెలిపారు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మృతి చెందడం బాధాకరమన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.రాజీవ్ గాంధీ 1991 మే 21న మరణించిన రాజీవ్ గాంధీ కలలు, దృష్టి, ఆయన నిబద్ధత భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా మార్చాయి అని తెలిపారు. సాంకేతికత, టెలికాం , వికేంద్రీకరణపై అతని విప్లవాత్మక ఆలోచనలు భారతదేశ ముఖచిత్రాన్ని మార్చాయి అని తెలిపారు. అంతేకాదు రాజీవ్ గాంధీ గొప్ప మనవుడని, ఆయన ఆలోచన విధానాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అని తెలిపారు.