విశాలాంధ్ర-విజయనగరం జిల్లా.రాజాం
భారత దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శరీరం విడిచిపెట్టడం చాలా బాధాకరమని దేశం చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ తెలియచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల ఆయన 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా కీర్తి గడించారని, దేశానికి ఎన్నో సేవలందించిన వ్యక్తి ఈరోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య కుమార్, మోటివేషనల్ స్పీకర్ బూరాడ శివకృష్ణ అన్నారు. జ్ఞానజ్యోతి విద్యాలయం కరెస్పాండెంట్ నడికుప్పల తారకేశ్వరరావు, కొత్త కోట కృష్ణమూర్తి, ఉరిటి శశి, రావాడ మధుబాబు, శ్రీకాంత్, ఉమ మరియు విద్యార్థులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.