Wednesday, July 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో జరిగే సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి ..

ధర్మవరంలో జరిగే సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి ..

సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి
ముసుగు మధు.
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; జూలై 31వ తేదీ, ఆగస్టు ఒకటో తేదీ లలో (రెండు రోజులు పాటు) ధర్మవరం పట్టణంలో జరగనున్న సిపిఐ పార్టీ జిల్లా మహాసభలను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఆ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగుమధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముదిగుబ్బలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై 31, ఆగస్టు ఒకటో తేదీలలో రెండు రోజులు పాటు ధర్మవరం పట్టణంలో జరిగే సిపిఐ పార్టీ జిల్లా మహాసభల నిర్వహణలో భాగంగా ముదిగుబ్బలో జరిగిన
అపార్టీ కార్యకర్తలు సమీక్ష సమావేశంలో తెలపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి మధు తో పాటు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పార్టీ గా సిపిఐ పార్టీ మాత్రమే ముందుకు దూసుకెళ్తోంది అన్నారు. కావున సిపిఐ పార్టీ కార్యకర్తలు కూడా తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆ పార్టీ మండల కార్యదర్శి , నియోజకవర్గ, జిల్లా కార్యదర్శుల దృష్టికి దృష్టికి తీసుకొచ్చి
ఆ సమస్యల పరిష్కరానికి ప్రతి కార్యకర్త తన వంతు కృషి చేయాలన్నారు. అదేవిధంగా జిల్లా మహాసభలకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఏఐటియుసి జిల్లా నాయకులు రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అన్నిటిని తక్షణమే అమలు చేయాలని తెలిపారు. ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ త్వరలో మండల కేంద్రమైన ముదిగుబ్బలో జరిగే మండల మహాసభలను కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య తో పాటు స్థానిక నాయకులు రాధాకృష్ణ , ఈశ్వర్ నాయక్, ప్రసాద్ నాయక్, వెంకటేశ్వర నాయక్, శంకర ,గంగిరెడ్డిపల్లి నాయుడు , తుమ్మల చెన్నప్ప, లింగుట్ల వెంకట రాముడు, రమేష్ నాయుడు, వెంకటరమణ, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు