Homeఆంధ్రప్రదేశ్కర్ణాటకలోని ధర్మస్థలి ఘటన దోషులను కఠినంగా శిక్షించాలి

కర్ణాటకలోని ధర్మస్థలి ఘటన దోషులను కఠినంగా శిక్షించాలి

- Advertisement -

 . ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య NFIW జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య డిమాండ్ 

మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలి 

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ డిమాండ్ 

 విశాలాంధ్ర –  రాజమహేంద్రవరం :గత వారం  రోజులుగా వెలుగు లోకి  వస్తున్న  కర్ణాటక రాష్ట్రం లోనీ మంజునాథ దేవాలయం  ధర్మస్థలంలో వందలాది మంది యువతులు మరియు మహిళలపై దారుణమైన అత్యాచారం మరియు హత్యోదంతం ఘటనలు భయానకం తో పాటు తీవ్రమైన ఆవేధనను, ఆందోళనను కల్గిస్తున్నాయినీ, ఈ హత్యోదంత ఘటనలపై సమగ్ర దర్యాప్తు ను జరిపి దోషులను కటినంగా  శిక్షించాలని ఆంధ్ర పదేశ్ మహిళా సమాఖ్య NFIW జిల్లా కార్యదర్శి పి.లావణ్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ కే ఆర్ ఉమెన్స్ కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది మహిళా సమాఖ్య  జిల్లా కార్యదర్శి పి.లావణ్య మాట్లాడుతూ ఈ హత్యోదంత పరంపర మనసును కలిచి వేస్తుందని, ఆశ్రమాల పేరుతో, ఆలయాల పేరుతో,ఆధ్యాత్మిక చింతన పేరుతో, భక్తి పేరుతో మహిళలను  వంచిస్తూ,సమాజంలో పెద్ద మనుషులుగా మతగురువులుగా, చెలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని, తమకున్న  అధికార బలం అండబలం, డబ్బు పలుకుబడితో  చేసిన  నేరాలు బయట పడకుండా  నిర్దోషులుగా చెలామణి అవుతున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యం  ధర్మస్థల ఉదంతాలే అన్నారు..1998 నుండి 2014 వరకు దాదాపు 500 పైగా అమ్మాయిలు శవాలు  పూడ్చిపెట్టారంటే ఆరాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు చూపిన నిర్లక్ష్యం కనిపిస్తుందని,ధర్మస్థల యాజమాన్యం నేరాల సాక్ష్యాధారాలను కూడా లేకుండా చేశారని,ప్రభుత్వం ను కూడ తమ కనుసన్నలలో ఉండేలా చేసుకున్నారనే అభిప్రాయం కలుగుతోందన్నారు..  ఈ కేసు మొదట జూన్ 22న, దాదాపు ఒక నెల క్రితం వెలుగులోకి వచ్చిందినీ,ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మరియు జూలై 14న మాత్రమే అని,అదికూడా విజిల్ బ్లోవర్ అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చి  తను చేసిన పాపాలను చెప్పుకోవాలి అనే భావంతో  తనతో బలవంతంగా ఖననం చేయించిన మృతదేహాలను బయటకు తీయమని కోరాడు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు పారిశుద్ధ్య కార్మికుడి ఒప్పుకోలు స్టేట్మెంట్ లో లైంగిక దాడులు, హత్యలు, ఖననాలు మరియు దహన సంస్కారాల యొక్క భయంకరమైన వివరాల వెల్లడి సభ్యసమాజం భయం తో నివ్వెర పోయేలా వుంది అన్నారు..

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ మాట్లాడుతూ

 1998 నుండి 2014 వరకు వందలాది మందిపై అత్యాచారాలు, హత్యలు, దహనం లేదా ఖననం చేయబడుతున్నాయని, ఇప్పటివరకు అది వెలుగులోకి రాకపోవడం దిగ్భ్రాంతికరం. 2014 తరువాత ఇంకెన్ని జరిగాయో ,తలుచుకుంటే భయంగా ఉందన్నారు..కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినప్పటికీ ధర్మస్థల పోలీసులు పూర్తిగా ఉదాసీనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. గతంలో సౌజన్య, అనన్యాబట్ మిస్సింగ్ విషయం లో పోలీస్ సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు బయటకు తీసి దోషులకు శిక్ష లు పడే విధంగా చేసివుంటే వుంటే కొన్ని అనర్థాలు అగేవి అన్నారు.. ముఖ్యంగా ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో నమోదైన తప్పిపోయిన వారందరి స్థితి నివేదికను తయారు చేయాలినీ, ఇది ధర్మస్థల ఆలయ ట్రస్ట్ యొక్క ప్రభావం మరియు శక్తిని మరియు రాజకీయ శక్తికి వారి సామీప్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తుందనీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వశ్రీవల్లి ,ఆర్ రాజేశ్వరి, ప్రియదర్శిని, కే హేమ , జే గాయత్రి, రెడ్డి శివలక్ష్మి, శ్యామల, దివ్యశ్రీ ,ఝాన్సీ , టి దివ్యశ్రీ ,ఎస్ నాగ రాజేశ్వరి,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు