Tuesday, January 7, 2025
Homeజిల్లాలుకర్నూలుహనుమంత రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

హనుమంత రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మాజీ ఎంపిపి, జడ్పిటిసి, సింగిల్ విండో అధ్యక్షులు బాపురం హనుమంతరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో నెల రోజుల క్రితం అకస్మికంగా మరణించిన సింగిల్ విండో అధ్యక్షులు బాపురం హనుమంతరెడ్డి, కుమారుడు బాపురం వీరసేనారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరుపున హనుమంతరెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈయన వెంట టీడీపీ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, ఏసేపు, హనుమంత రెడ్డి, నల్లమల విజయ్ కుమార్, సిద్ధప్ప, ఇస్సాక్, వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రా రెడ్డి, కుటుంబ సభ్యులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు