Saturday, February 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేశ సేవ చేయుటలో ఆర్మీల కృషి అనన్యనీయం.. హెడ్మాస్టర్ నరేంద్ర

దేశ సేవ చేయుటలో ఆర్మీల కృషి అనన్యనీయం.. హెడ్మాస్టర్ నరేంద్ర

విశాలాంధ్ర ధర్మవరం;; దేశ సేవ చేయుటలో ఆర్మీల కృషి అనన్యనీయమని హెడ్మాస్టర్ నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాలలో పుల్వామా ఘటనలో మరణించిన 40 మంది వీర సైనికులను స్మరిస్తూ బ్లాక్ డే నిర్వహించారు. అనంతరం మౌనవహించి సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులందరూ కూడా బ్లాక్లిబండ్లను ధరించి, వీర జవానులకు ఘనంగా నివాళులర్పించారు. తదుపరి దేశ సేవ చేసిన ఎక్స్ ఆర్మీ లు నాగ మల్లేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామాంజనేయులను వారు చేసిన దేశ సేవకు గుర్తుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు