జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు.
విశాలాంధ్ర వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 2వ రోడ్డు నిర్మాణం కొరకు శనివారం ఉదయం జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు.
తదుపరి, శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. స్వామివారి కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2వ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు పంపించాం. అందులో భాగంగా, మొదటగా జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించడం జరిగిందని, ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని” తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఉప కమీషనర్,ఆలయ కార్యనిర్వాహనాధికారి కె. వి సాగర్ బాబు,దేవస్థానం సిబ్బంది,ఎస్ ఐ మరిడి నాయుడు,వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష కుమార్,ఘట్టమనేని లక్ష్మీనరసింహం, వలేటి మధు,గుత్తా మహేశ్వరరావు, కామినేని అశోక్, కాకుమాని ఆంజనేయులు,వేమూరి రాజ, కూడలి బాస్కర్,చొప్పర బ్రహ్మయ్య, ప్రగడ మోహన్, చెంచు శ్రీనివాసులు, కామినేని రఘు, పంది లక్ష్మీ నారాయణ, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.