మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని రెండు క్యాంటీన్లలో భోజనము, అల్పాహారం నాణ్యతగా ఉండేటట్లు చర్యలు గైకొనాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ భుజిస్తున్న ప్రజల్ని భోజనం యొక్క రుచి, నాణ్యత, తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వారు భోజనము, అల్పాహార పదార్థాలను స్వయంగా తనిఖీ చేస్తూ, రుచి కూడా చూశారు. అన్నా క్యాంటీన్ కు వచ్చేవారిని గౌరవంగా పలకరించాలని, ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ అన్నా క్యాంటీన్లకు సమన్వయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని తెలిపారు. ఇప్పటికే వందల సంఖ్యలో పట్టణము, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పేద ప్రజలు ఈ అన్నా క్యాంటీన్ ని సద్వినియోగం చేసుకోవడం నిజంగా సంతోషిదాయకమని తెలిపారు. తదుపరి తెల్లవారుజామున అంజుమాన్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, తేరు బజార్, మెయిన్ రోడ్, మండి మార్కెట్ తదితర ప్రాంతాలను వారు పరిశీలిస్తూ, పారిశుద్ధ్య కార్మికులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సేవాభావంగా తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్సన్, కేశవ, మేస్త్రీలు పాల్గొన్నారు.
అన్నా క్యాంటీన్లో భోజనం నాణ్యతగా ఉండాలి..
RELATED ARTICLES