Friday, May 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రామీణ ప్రాంతాలకూ ఉత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యం

గ్రామీణ ప్రాంతాలకూ ఉత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యం

– ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్.
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖలో సేవల పురోగతి, భవిష్యత్ ప్రణాళికల పై సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు ,ఇతర శాఖల సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో ప్రభుత్వం, ఆరోగ్య రంగంలో అనేక కీలక మార్పులు తీసుకొని రావడం జరిగిందన్నారు. ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సేవలందించేందుకు పలు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి, వైద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ముందు సాగే దిశగా శాఖల పనితీరును సమీక్షించడం, లోపాలను గుర్తించి పరిష్కార మార్గాలు సిద్ధం చేయడం, ప్రతి ఉద్యోగి తన విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని వారు స్పష్టం చేశారు. అలాగే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాఖల సామర్థ్యాన్ని పెంచడం, కొలతకు లోబడి ఉండే లక్ష్యాలను నిర్ధేశించడం, ఉత్తమ కార్యకలాపాల ప్రకటన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరాన్ని ఆయన హితవు పలికారు. ప్రజల ఆరోగ్యం మన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని, నూతన ఆలోచనలు, ఉత్తమ పద్ధతులను తీసుకురావడం ద్వారా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు సాధించగలము అని తెలిపారు. ప్రతి ఉద్యోగి ప్రజల పట్ల సేవా దృక్పథంతో పనిచేయాలి అన్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖ మరింత సమర్థవంతమైన కార్యాచరణకు దిశానిర్దేశం చేసినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఆరోగ్య సేవలను మరింత విస్తృతంగా, నాణ్యమైన స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు