Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మాలక్ష్యము..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మాలక్ష్యము..

రోటరీ క్లబ్ కమిటీ
విశాలాంధ్ర- ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా యొక్క లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల 23వ తేదీ ఆదివారం నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు , జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కొత్తపల్లి ఉలిక్కి రెడ్డి జ్ఞాపకార్థం భార్య కొత్తపల్లి సరస్వతమ్మ, కోదండరాం లలితమ్మ, కీర్తిశేషులు లక్ష్మీ దేవమ్మ, కృష్ణమూర్తి రావు జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్వహించుచున్నారని తెలిపారు. ఈ ఉచిత కంటి శిబిరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఉచిత కంటి ఆపరేషన్లు, ఉచిత రవాణా సౌకర్యం, ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి బిపి, షుగర్ ఉన్నవాళ్లు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని రావాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకుని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 94409 29894 కు గాని 9493361692 గాని 99 4937590కు గాని సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు