క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలాచార్యులు, రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల ఆరోగ్యమే మా లయన్స్ క్లబ్ లక్ష్యము అని అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలాచార్యులు, రమేష్ బాబు, కోశాధికారి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి క్యాంపు దాతగా కీర్తిశేషులు చెన్నం శెట్టి నాగభూషణం వారి జ్ఞాపకార్థం కుమారుడు లయన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉచిత శిబిరాలు కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు వెంకటస్వామి, కంటి ఆసుపత్రి ప్రమోటర్ కీర్తిశేషులు గూడూరు నాగయ్య ఆధ్వర్యంలో నడవడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మానవుని శరీరంలో కన్ను అతి ముఖ్యమైన భాగమని, ఆ భాగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. పట్టణంలోని ఎర్రగుంటలో లయన్స్ క్లబ్ ఆసుపత్రి ఉందని, ఇందులో కంటి వైద్య నిపుణులు కిరణ్ కుమార్చే ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారిలో ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచిత వసతి, ఉచిత భోజనం, ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆర్థిక స్థితి ఉన్నవారికి కూడా తక్కువ ధరలోనే మెరుగైన సేవలను కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. దగ్గర చూపు దూరం చూపు ఇబ్బంది కలవారిని కూడా కంప్యూటర్ ద్వారా మా కంటి ఆసుపత్రిలో కంటి అద్దాలను కూడా పొందే అవకాశం ఉందని తెలిపారు. కంటికి లేజర్ చికిత్స కూడా తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దాతల సహాయ సహకారములతోనే ఈ కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఈ క్యాంపు లను విజయవంతం చేస్తూ, విరాళం అందించిన ప్రతి ఒక్క దాతకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా లైన్స్ క్లబ్ వివిధ సేవలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో 56 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 32 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని. కంటి వైద్య చికిత్సలను ఆప్తమాలజీ అసిస్టెంట్ నాగేంద్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు.వీరికి ప్రకటించిన తేదీన కంటి ఆపరేషన్ లను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ దాస్, మేటి కల కుళ్లాయప్ప, రాజగోపాల్, గోషే రాధాకృష్ణ, ఉట్టి శివప్రసాద్, ముక్తాపురం కృష్ణ, పల్లె వేణుగోపాల్, చందా నాగరాజు, పుట్లూరు నరసింహులు, కంటి రోగులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యమే మా లయన్స్ క్లబ్ లక్ష్యం..
RELATED ARTICLES