– మంత్రి సత్య కుమార్ యాదవ్
చేనేత కార్మికుల కోసం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ – మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం ; భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా ధర్మవరం పట్టణం ఒకటవ వార్డు(గుడ్సేట్ కొట్టాల) నందు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బిజెపి జెండాను ఆవిష్కరించారు.అనంతరం మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ,ముందుగా ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యల కోసం కృషి చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ సంక్షేమ పథకాలు రాజకీయ వివక్ష లేకుండా అందరికీ అందేలా కృషి చేస్తానని అదేవిధంగా పట్టణంలో ప్రజలకు అనుగుణంగా వంద పడకల ఆస్పత్రిని 150 ఆసుపత్రి పడకల చేయడం గాని, లేదా ఐదు పడకల గా ఉన్నాడు డయాలసిస్ సెంటర్ ని పది పడగల డయాలసి సెంటర్ చెయ్యడం గాని, లేదా ఒకే రోజు 5000 మందికి జాబ్ మేళా నిర్వహించి దాదాపు 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా అభివృద్ధి పైన దృష్టి పెట్టామని గ్రామాల్లో రహదారులు నిర్మాణం చేయడం గాని,లేదా గతంలో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు పైన అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పన అదేవిధంగా గ్రామీణ హామీ పథకం కింద ఉపాధి కల్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.ప్రజల సమస్యలు ఒక్కొక్కటి గుర్తిస్తున్నామని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నామని చేనేత కార్మికుల వారి రుణం తీర్చుకునే విధంగా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు చేశామని తెలిపారు. వాటికోసం స్థల సేకరణ కూడా చేస్తున్నారని వాటిని తొందర్లోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాకుండా యువత కోసం ఆకీ స్టేడియం కోసం మంజూరు చేసే ప్రయత్నం చేస్తున్నామని, అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ట్రస్టు ద్వారానే పనిచేయడం కాకుండా ప్రభుత్వ వైపు నుంచి కూడా అనేక రకమైన పనులు చేయడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రచార సమయంలో చాలా హామీలు ఇచ్చాం అని వాటిని ఒక్కొక్కటిగా ప్రజలకు తీర్చుకుంటూ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్, బిజెపి మైనారిటీ నాయకులు నబి రసూల్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, కృష్ణాపురం జమీర్, బిల్లే శ్రీనివాసులు, బోయ పెద్ద లింగమయ్య బ్రదర్స్, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ, కంచుపు నరప్ప, రవికుమార్, అనిల్, నాగేంద్ర, రమేష్ ,బిజెపి మహిళా నాయకురాలు కంచం లీలావతి, మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.