Wednesday, February 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంపేదల ప్రాణాల పరిరక్షణ నే సిపిఐ పార్టీ లక్ష్యం

పేదల ప్రాణాల పరిరక్షణ నే సిపిఐ పార్టీ లక్ష్యం

ఆరోగ్యశ్రీ అమలు చేయని సవేరా పై చర్యలు తీసుకోవాలి…

ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడి అరికట్టాలి…

సిపిఐ నగర్ కార్యదర్శి ఎన్ శ్రీరాములు

విశాలాంధ్ర -అనంతపురం : పేదల ప్రాణాల పరిరక్షణ నే సిపిఐ పార్టీ లక్ష్యం అని ఆరోగ్యశ్రీ అమలు చేయని సవేరా పై చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర్ కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్ చేశారు. సవేరా హాస్పిటల్ పై చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గురువారం స్థానిక జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు సిపిఐ నగర్ సమిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి రమణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధితురాలు సుజాత భర్తకు క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు భర్తకు సేవలు చేస్తున్న సుజాత కు జనవరి 28న గుండె నొప్పి రావడం జరిగిందన్నారు. వెంటనే కేరిఎన్ క్యూర్ ఆసుపత్రి వారు సవేరా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఉందని అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ సందీప్ కు రెఫర్ చేయడం జరిగిందన్నారు. వెంటనే సవేరా హాస్పిటల్కు తెల్లవారుజామున ఒంటిగంటకు పోవడం జరిగిందన్నారు. సవేరా ఆస్పత్రిలో టు డీకే, ఎంజో గ్రామ్ చేయాలంటే డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు అన్నారు. ఆరోగ్యశ్రీ ఉంది కదా అని అడగడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేయమని ఖచ్చితంగా చెప్పడం జరిగిందన్నారు. సవేరా ఆస్పత్రిలో ఐదు వేలు కట్టి మూడు గంటల ప్రాంతంలో మార్క్ ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం చెప్పగానే దగ్గర ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తామని వెంటనే బాధితురాలు తీసుకురావాలని చెప్పడం జరిగిందన్నారు. మార్కాసుపత్రిలో ఎంజో గ్రామ్ చేసి ఒక స్టంట్ వేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ మాలోల కు సవేరా ఆస్పత్రి పై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు చేసి రెండు వారాలైనప్పటికీ వైద్యారోగ్య శాఖ అధికారి స్పందించకపోవడంతో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న సవేరా, కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ స్పందిస్తూ… ఆస్పత్రులపై ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఇరవై ఒక్క రోజుల్లో ఫిర్యాదును భద్రంగా పరిశీలించి ఫిర్యాదులు క్లోస్ చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగిందన్నారు. సవేరా పై వచ్చినటువంటి ఫిర్యాదు ఈరోజు పదిరోజులైందని కచ్చితంగా వారం రోజులో సమగ్రంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజులో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇది అన్న కార్యక్రమంలో సిపిఐ నగర సహకార దర్శి అలిపిర, ఈశ్వరయ్య, కాజా హుస్సేన్ , మున్నా, నాగప్ప, బి రాజు, జిలాన్ భాషా, వరలక్ష్మి, కమ్మక్క, ఏఐటీయూసీ కార్యదర్శి నగర కృష్ణుడు , ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఆనందు,శ్రీనివాసులు, చంద్రబాబు నగర్ నాయకులు ఖాజా, మొహిద్దిన్, నరసింహులు, రవి, భాషా, సూర్యనారాయణ, నవయుగ కాలనీ నాయకులు వారి జాఫర్,షేక్షావల్లి, నాగమునమ్మ, రోషీన, ఆచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు