Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాల బాలికల బంగారు భవితే లక్ష్యం.. ఎంపీడీవో సాయి మనోహర్

బాల బాలికల బంగారు భవితే లక్ష్యం.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర ధర్మవరం : బాల బాలికలకు బంగారు భవితే లక్ష్యము అని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఐ సి డి ఎస్ సి డి పి ఓ లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిషోర్ వికాసం అనే కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఎంపీడీవో, సిడిపిఓ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి బాల బాలికలకు ఎదురయ్యే సమస్యలు వాటిని పరిష్కార మార్గాలను కనుక్కోవడం సులభతారం అవుతుంది అని తెలిపారు. బాల్య వివాహాలు, చైల్డ్ ట్రాఫికింగ్, న్యూట్రియల్, ఆరోగ్యం తదితర వాటిని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీసులు, ఏఎన్ఎంలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, నోడల్ టీచర్లు, జెసిబిఎస్ సూపర్వైజర్లు ,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు