సిపిఐ నియోజ వర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర -ధర్మవరం; ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణం లో ఎమ్మార్వో కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ముసుగు మధు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలము ఇస్తామని అలాగే ఇండ్లు నిర్మించుకోవడానికి 5,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తామని తెలిపిందని, తదుపరి కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొంత గడువు ఇచ్చిన పేదల పట్ల నిర్లక్ష్యంగా ప్రభుత్వము వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నందున పేదల నివాస స్థలానికి కూటమి ప్రభుత్వము చెప్పిన మాట ప్రకారము నివాస స్థలాలు,నిర్మించుకోవడానికి నిధులు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వారి డిమాండ్ చేశారు. ఉద్దేశంతో ముందుగానే ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా సూచనలు చేస్తున్నామని వారు బడ్జెట్లో ఇంటి పట్టాల కోసం ఇంటి నిర్మాణాల కోసం ఎన్నికలలో ఇచ్చిన హామీల కోసం ముందు జాగ్రత్తగా బడ్జెట్ కేటాయింపులు జరిగితే వారి యొక్క మాట ప్రకారం పేదలకు నివాస స్థల మంజూరు చేయటానికి సులభం అవుతుందని తెలిపారు, ప్రభుత్వము చెప్పిన మాట నెరవేర్చటానికి వీలుగా ఉంటుందని లేదంటే ప్రభుత్వం చెప్పిన ప్రకారము పేదలకు చెప్పిన మాట నెరవేర్చకపోతే పేదలతో కలిసి పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు, పోలా లక్ష్మీనారాయణ, చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బుడగ వెంకట నారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి సకల రాజా, సిపిఐ నాయకులు శ్రీనివాసులు, రంగయ్య, ఆది, శ్రీధర్, ఈశ్వరయ్య, కొండ,ముత్యం రవీంద్ర, మహిళా సమాఖ్య తరపున లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, మరియు అనుబంధ సంస్థలు నాయకులు,లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..
RELATED ARTICLES