మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామికి వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : దోబీ ఘాట్ కు ఉచిత విద్యుత్ ఇవ్వాల ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామికి ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. లింగమయ్య సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనంతపురము నగర పాలక సంస్థ పరిధిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వున్న చెరువులో ఒక దోబీఘాట్, ఒక బోరు మోటారు ఏర్పాటు చేసుకొని రజకులకు దాదాపు 25 సం||ల క్రితం సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అక్కడ ఇప్పటికీ రజకులంతా గుడ్డలు ఉతుక్కొని జీవనం చేస్తున్నారన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ప్రభుత్వ నిధులతో దోబీఘాట్ దగ్గర కరెంటు సౌకర్యం కూడా కల్పించారు. సదరు కరెంటు బిల్లును గతంలో నగర పాలక సంస్థ భరించేదన్నారు.
ప్రస్తుతము సదరు కరెంటు బిల్లులు మా పేర్ల మీద వస్తున్నాయన్నారు. కరెంటు బిల్లులను ప్రభుత్వమే భర్తిస్తుందని జి.ఓ కూడా భర్తీ చేశారన్నారు. రజకవృత్తి చేసుకొని జీవిస్తున్న మాకు కరెంటు బిల్లు భారం లేకుండా చేసి న్యాయము చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి నాగప్ప కార్పొరేటర్ శ్రీనివాసులు, సి జయరాములు, సి. కులయప్ప, సి షేక్షావలి, పి. మల్లికార్జున, సి రాముడు, సి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.