Saturday, April 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంగొప్ప సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్

గొప్ప సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : భారత తొలి దళిత ఉప ప్రధాన మంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఉరవకొండ నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాలలో జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధులు , సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. గ్రామంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమ కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ధనుంజయ, సిబ్బంది దశరథ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు