మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; గ్యాస్ ధరలతో పెంపుతో సామాన్యులపై పెనుభారం తగదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సిలిండర్లను మోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను ప్రభుత్వమే భరించాలని, గతంలో వైయస్సార్ మహిళపై భారం పడకుండా ఆదుకోవడం జరిగిందన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీలు ఏమయ్యాయి అని వారు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఎందుకు ధరలు తగ్గించలేకపోతున్నారని వారు మరోసారి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై 14.2 కేజీల సిలిండర్ల పై 60 రూపాయలు పెరగడం జరిగిందన్నారు. అలాగే కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెంచడం దారుణం అన్నారు. ప్రస్తుతం యుద్ధం పరిస్థితుల్లో నేపథ్యంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని వారు గుర్తు చేశారు. గృహ వినియోగదారులు మళ్లీ సిలిండర్ బుక్ చేయాలంటే 21 రోజులు వరకు బుకింగ్ లేకపోవడం దారుణం అని తెలిపారు. ప్రజల కష్టాలు చంద్రబాబుకు నిజంగా తెలిస్తే పెంచిన గ్యాస్ ధరలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా క్షేత్రములో తగిన మూల్యం చెల్లించుకొక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాల్రెడ్డి, నీలూరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెందమూరి నారాయణరెడ్డి, కత్తి పెద్దన్న ,కౌన్సిలర్లు బోయ రమాదేవి, కత్తే ఆదిలక్ష్మి, సబేహా, పద్మజా, సునీత తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరలతో పెంపుతో సామాన్యులపై పెనుభారం..
- Advertisement -
RELATED ARTICLES


