సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్,పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను సిపిఐ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పహల్గాంలోని బైసరన్ లో ఉగ్రదాడి చేసి 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకుంది అన్నారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతకానికి పాల్పడినట్టు ప్రకటించుకున్నారన్నారు. అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్రలో భాగంగా ఈ సంవత్సరం జూలై మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు లక్షల మంది యాత్రికులు రెండు మార్గాలలో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళుతుంటారు అని పేర్కొన్నారు. అనంతనాగ్ జిల్లాలో పహాల్గాం నుంచి, గాంధర్బల్ జిల్లా బాల్తాలా నుంచి చేరుకునే అవకాశం ఉందన్నారు. సాయిధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగ పడ్డారన్నారు. పురుషులే లక్ష్యంగా 28 మంది పర్యాటకులను హతమార్చడం జరిగిందన్నారు.. టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థకు మతం లేదు అన్ని మతాల పైన దాడులు చేశారన్నారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నామన్నారు. మరణించిన 28 కుటుంబాలకు సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా భారత ప్రభుత్వం ఇంటిలిజెన్సీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయాలని సిపిఐ సూచిస్తోందని పేర్కొన్నారు.