Monday, February 10, 2025
Homeజాతీయంఆదాయపు పన్నుపై బడ్జెట్ లో కీలక ప్రకటన.. పరిమితి పెంచిన కేంద్రం

ఆదాయపు పన్నుపై బడ్జెట్ లో కీలక ప్రకటన.. పరిమితి పెంచిన కేంద్రం

బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించింది. టీడీఎస్ పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.50 వేల పరిమితిని రూ. లక్షకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించింది. అద్దె ద్వారా వృద్ధులు పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.2.4 లక్షల పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపును వర్తింపజేస్తామని తెలిపారు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే మరో రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పెరగనుంది. మొత్తంగా రూ.12.75 లక్షల వార్షికాదాయం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుంది.

కొత్త పన్ను శ్లాబులు..

రూ. 4 లక్షల వరకు ఉ పన్ను లేదు

రూ.4 నుంచి 8 లక్షల వరకు – 5%

రూ.8 నుంచి 12 లక్షల వరకు – 10%

రూ.12 నుంచి 16 లక్షల వరకు – 15%

రూ.16 నుంచి 20 లక్షల వరకు – 20%

రూ.20 నుంచి 24 లక్షల వరకు – 25%

రూ.24 లక్షల పైన 30 శాతం

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు