Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ..

యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ..

కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం;; యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ వర్ధంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను వారు కొనియాడారు. రాజీవ్ గాంధీ హయాంలో పేదలకు అండదండగా ఉన్నారని తెలిపారు. నేటి యువత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకొని, దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాహిర్, కలీం, మునాఫ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు