Homeక్రీడలుచిచ్చరపిడుగు చిన్నోడు చితక్కొట్టాడు

చిచ్చరపిడుగు చిన్నోడు చితక్కొట్టాడు

- Advertisement -

18 బంతుల్లో 50 పరుగులు చేసిన వైభవ్
తొలి టీ20లో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం
క్రీడలు:
చిచ్చరపిడుగు చిన్నోడు జోరందుకున్నాడు. తనదైన సహజ శైలిలో విజృంభించాడు. ఇంగ్లాండ్‌లో నిరాశపరిచిన వైభవ్… అభిమానులను మురిపిస్తూ జింబాబ్వేలో సత్తా చాటాడు. 18 బంతుల్లోనే అరÆశతకంతో అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్నవయసులో అరÆసెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ బ్యాటుతో మెరిస్తే…మయాంక్ యాదవ్ బంతితో విజృంభించాడు. ఫలితంగా తొలి టీ20లో టీమ్ఇండియా…జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. కెప్టెన్గా శ్రేయస్‌కు తొలి విజయం దక్కించింది. తన సమర్థతపై సందేహాలను తీరుస్తూ జింబాబ్వేలో వైభవ్ బ్యాట్ ఝళిపించాడు. బౌలర్లను చితక బాదాడు. ఎంగరవ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో వరుసగా 6, 4, 6తో విరుచుకుపడ్డాడు. బ్యాక్ఫుట్‌పై లాంగాఫ్‌లో అతడు కొట్టిన సిక్స్ర్ హైలెట్‌గా నిలిచింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో తన సత్తా చాటుకుంటూ మరొక్కసారి అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు.
జింబాబ్వే పర్యటనను టీమ్ఇండియా ఘనంగా ఆరంభించింది. వైభవ్ సూర్యవంశీ (50: 19 బంతుల్లో 4×4, 4×6) విధ్వంసంతో గురువారం ఏకపక్షంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ బృందం 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే…భారత బౌలర్ల ధాటికి తడబడింది. 7 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. వైభవ్తో పాటు ఇషాన్ కిషన్ (35: 24 బంతుల్లో 3×4, 2×6) బ్యాట్ ఝళిపించడంతో తమ లక్ష్యాన్ని భారత్…కేవలం 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మయాంక్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20 శనివారం జరుగనుంది.
వైభవ్ రికార్డు…
పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్నవయసులో అరÆశతకం సాధించిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్ల 118 రోజులు) రికార్డు సృష్టించాడు. నేపాల్కు చెందిన కుశాల్ మల్లా (15 ఏళ్ల 340 రోజులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు