Saturday, March 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ ముఖ్య లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ ముఖ్య లక్ష్యం..

అధ్యక్షులు జయసింహ
విశాలాంధ్ర -ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణ కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల తొమ్మిదవ తేదీ ఆదివారం నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకర కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే 65 వేలకు పైగా కంటి ఆపరేషన్తో పాటు, ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈనెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ( టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల) శిబిరమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంపునకు వచ్చువారు బీపీ, షుగర్ ఎక్కువ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని, తగ్గించుకున్న తర్వాత రావాలని తెలిపారు. ఈ శిబిరంకు దాతలుగా కీర్తిశేషులు లలితమ్మ, కీర్తిశేషులు బిఎల్ వెంకటరెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు జివి రాజగోపాల్ రెడ్డి కోడలు సుగుణమ్మలు వ్యవహరించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉచిత చికిత్సలతో పాటు ఉచిత ఆపరేషన్, ఉచితంగా అద్దాలు ఇవ్వబడునని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి చికిత్సలకు వచ్చేవారు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ గుర్తింపు, ఓటర్ కార్డులలో ఏదేని రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు, సెల్ నెంబర్తో చిరునామాతో రావాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ ,గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి, కొండయ్య, బోనాల శివయ్య, పెరుమాల దాస్, గట్టు హరినాథ్, బండారు వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు