అధ్యక్ష, కార్యదర్శులు జయసింహ, నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం అని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ ,కోశాధికారి వై.సుదర్శన్ గుప్తా,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ గట్టు హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వివిధ రూపాలలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవలను అందిస్తూ పేద ప్రజల మన్ననలను పొందుతుండడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. అంతేకాకుండా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నడుస్తోందని తెలిపారు. ఈ కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్బు ,శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ- శ్రీ సత్య సాయి జిల్లా వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లమ్మ, కీర్తిశేషులు గోరకాటి పెద్దారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోరకాటి ప్రమీలమ్మ గోరకాటి రఘునాథరెడ్డి వ్యవహరించడం పట్ల క్లబ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరానికి వచ్చిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి పేదవానికి ఉచిత వైద్యం, ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా సౌకర్యం, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ శిబిరంలో 145 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 96 మందికి ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్లు చేయించుకున్న వారందరూ కూడా మీ యొక్క ఆపరేషన్లు రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించామన్న సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయాలని తెలిపారు. నేటి ఈ శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల అందరికీ రోటరీ క్లబ్ వారు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. అంతేకాకుండా నేత్రదానమును కూడా ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో చేయాలని వారు తెలిపారు. అలా నేత్రదానం చేస్తే రెండు జీవితాలలో వెలుగులు నింపుతారని తెలిపారు. అనంతరం డాక్టర్ రాధిక తో పాటు దాతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పల్స్ పోలియో చైర్మన్ రత్నశేఖర్ రెడ్డి, రమేష్ బాబు, శివయ్య ,కొండయ్య ,శ్రీనివాసుల రెడ్డి, బండారు వెంకటచలం, మనోహర్ గుప్తా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
RELATED ARTICLES