క్లబ్ అధ్యక్షులు జయసింహ
విశాలాంధ్ర- ధర్మవరం : పేద ప్రజలకు ఉచితంగా కంటి వెలుగును అందించడమే రోటరీ కాపు యొక్క ముఖ్య లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ ,ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం జయసింహ, కార్యదర్శి నాగభూషణం, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో 1994లో రోటరీ క్లబ్ స్థాపించడం జరిగిందని ఇప్పటిదాకా 34 వేల మందికి కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచిత ఆపరేషన్లు, ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. శిబిరానికి వచ్చిన కంటి రోగులందరికీ కంటి డాక్టర్ సాక్షి వైద్య చికిత్సలను అందించడం జరిగింది అన్నారు. దేశవ్యాప్తంగా రోటరీ క్లబ్ వివిధ సేవలను అందిస్తుందని తెలిపారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు లలితమ్మ కీర్తిశేషులు వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు జీవి రాజగోపాల్ రెడ్డి కోడలు సుగుణమ్మ వారి కుటుంబ సభ్యులను ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతూ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా క్లబ్ తరఫున కంటి డాక్టర్ సాక్షి ను కూడా సత్కరించారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 137 మంది కంటి వైద్య పరీక్షలను పరీక్షించగా 102 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వీరికి అనుకున్న తేదీల్లో ఉచితంగా బెంగళూరులో కంటి ఆసుపత్రి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తదుపరి కంటి డాక్టర్స్ సాక్షి ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ తర్వాత కంచిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య ,రమేష్, బండారు వెంకటచలం, శివయ్య , మనోహర్ గుప్తా, పెరుమాల్లదాస్ ,సత్రశాల ప్రసన్నకుమార్, రామకృష్ణ ,బత్తలపల్లి శ్రీనివాస్, అంబిక తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు ఉచితంగా కంటి వెలుగును అందించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
RELATED ARTICLES