Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉత్సాహంగా ఉట్లమాను పరుష

ఉత్సాహంగా ఉట్లమాను పరుష

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గమ్మ గుడి ఆవరణముందు ఉట్లమాను ఉత్సవ కమిటీ బోయ నర్సింలు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉట్లమాన పరుషకు దాదాపు 100 మంది పోటీపడ్డారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కేరింతల నడుమ ఉత్సాహపరితంగా ఈ ఉట్లమాన పరుష జరిగింది. ఉట్లమాను పైన నుంచి బురద జల్లడం, ఉట్ల మాను ఎక్కేవారు జారడం లాంటి సన్నివేశాలు అందరిని ఉత్తేజపరిచాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఉట్లమాను ఉత్సవ కమిటీలో ఈ ఉట్లమాను పరుష జరుగుతోంది. చిట్ట చివరకు ఉట్లమానును బోయ జనార్దన్ అవలీలగా ఎక్కి విజేత అయ్యారు. ఈ సందర్భంగా పుట్ల మాను ఉత్సవ కమిటీ బోయ నర్సింలు ముత్యాలు రంగుల నారాయణ చేతుల మీదుగా విజయతకు రూ.10,016 నగదును అందజేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.ఈ ఉట్లమాను పరిసలో వందల సంఖ్యలో ప్రజలు, బోయ కులస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు