Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..

ఈ నెల 24న బుల్లెట్‌పై రాజమహేంద్రవరం బయలుదేరిన పాస్టర్
మధ్యాహ్నం కోదాడలో మద్యం కొనుగోలు
కంచికచర్ల పరిటాల మధ్య అదుపుతప్పి కిందపడటంతో గాయాలు
రామవరప్పాడు రింగ్ వద్ద పాస్టర్ కు ఎస్సై ప్రవీణ్ సాయం

సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడిని విప్పుతున్నారు. విజయవాడలో ప్రవీణ్ మూడు గంటలపాటు ఎక్కడ ఉన్నారన్న విషయంలో కొంత స్పష్టత వచ్చింది. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు సేకరించిన పోలీసులు ప్రవీణ్ ప్రతి కదలికను గుర్తించినట్టు సమాచారం. ఇందుకోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ప్రవీణ్ మహానాడు కూడలి దాటిన తర్వాత రామవరప్పాడు రింగ్ వస్తుంది. అక్కడి సీసీ కెమెరాల్లో ప్రవీణ్ జాడ కనిపించలేదు. దీంతో మహానాడు కూడలి, రామవరప్పాడు రింగ్‌కు మధ్యలో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. రామవరప్పాడు రింగ్‌కు 10 మీటర్ల దూరంలో వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పైనుంచి ప్రవీణ్ కిందపడినట్టు గుర్తించారు. గమనించిన ఆటో డ్రైవర్లు రింగ్‌లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని కిందపడిన పాస్టర్‌ను పైకిలేపి రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు