Homeఆంధ్రప్రదేశ్కాసు లిస్తేనే కుట్లు

కాసు లిస్తేనే కుట్లు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఆ కమ్యూనిటీయల్ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే మద్యం మత్తులో కుట్లు వేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే కానీ కుట్లు వేయని ఉద్యోగి బాగోతం బయట పడింది. అతను మద్యం సేవించి విధులకు హాజరు అవుతారు. ఇతనిని ప్రశించే నాధుడే లేరు. కొవ్వూరు కమ్యూనిటీయల్ సెంటర్లో సౌకర్యాలు కరువయ్యాయని గతంలో వరుస కథనాలతో విశాలాంధ్ర పత్రిక సమస్యలను బయట పెట్టడంతో స్పందించిన అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. కొంతకాలం సజావుగా సాగుతున్నట్లుగా అనిపిస్తున్నా ఇంకా కొంతమంది ఉద్యోగుల తీరులో ఇంకా మార్పు రానట్లుగా కనిపిస్తుంది. కుట్లు వేసే పర్మనెంట్ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరవటం వచ్చిన పేషెంట్లకు డబ్బులు ఇస్తేనే చికిత్స చేస్తానని డిమాండ్ చేసే స్థాయికి అతను ప్రవర్తిస్తున్నాడు. ఇదేమిటని విశాలాంధ్ర ప్రతినిధి ప్రశ్నించగా నా పేరు ఇది మీ ఇష్టం వచ్చినట్లు రాసుకో అని ధీమాగా సమాధానం చెబుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు లేదా అతను సేవించిన మద్యం ఇలా మాట్లాడిస్తుందా అని అనిపిస్తుంది. ఆసుపత్రి యంత్రాంగం నిత్యం అతన్ని వారిస్తున్నా అతనిలో ఏ విధమైన మార్పు రావటం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఎన్నో మార్లు అతనిపై ఫిర్యాదులు చేశామని కానీ అతను పద్ధతిని మార్చుకోవడం లేదని వారు అంటున్నారు. ఇక్కడ కుట్లు వేయడానికి వేరొక సిబ్బంది లేకపోవడంతో అతనిపైనే ఆధార పడవలసిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మరి ఏదైనా కుడి ఎడమై పొరపాటు జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు