94 శాతం పెన్షన్ పంపిణీ.. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు పెన్షన్ కేంద్రాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కొన్ని కేంద్రాల వద్ద కమిషనరే స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పెన్షన్ను సచివాలయ సిబ్బంది ఇంటింటా వెళ్లి పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని 40 వార్డులలో 18,032 మంది పెన్షన్ దారులకు 7 కోట్ల 84 లక్షల 63 వేల 500 రూపాయలను సకాలంలో పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన 94 శాతం పెన్షన్లను మా సచివాలయ258 మంది ఉద్యోగులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెన్షన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈనెల మూడవ తేదీ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
సజావుగా జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం
RELATED ARTICLES