విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో ఉంటున్న మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం ఇప్పటికే పలు జిల్లాలలో, పలు రాష్ట్రాలలో తమ నృత్యాన్ని ప్రదర్శించి మంచి గుర్తింపు పొందడం జరిగింది. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి సమీపంలోని గుడిపల్లి గ్రామం నందు రంగనాథ స్వామి దేవస్థానం స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాల వైభవంగా తిరుప్పాడ సేవ నిర్వహించడం జరిగింది. తదుపరి ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం 15 మంది చిన్నారులచే నృత్య ప్రదర్శన చేసిన వైనం అక్కడి భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. నృత్య ప్రదర్శన చూసిన సోమందేపల్లి ప్రజలు , భక్తాదులు చప్పట్లతో మారుమోగాయి. అనంతరం ప్రసిద్ధ నాట్య గురువు రంగాచార్యులు చేతులమీదుగా అలాగనే దేవస్థానం పురోహితుల చేతులమీదుగా గురువు మానసను ఘనంగా సన్మానం చేసి, అమ్మవారికి అలంకరించే చీరను మానసకు బహుకరించారు. గురువు మానస మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, కళ లను ఇనుమడింప చేయడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని పొందినందుకు గురువుతో పాటు శిశు బృందం ఆలయ కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.
ఆకట్టుకున్న మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం ప్రదర్శన.. గురువు మానస
RELATED ARTICLES