

పేదల ఇంటి స్థలాల అర్జీలు బాధ్యతగా నెత్తిన మోస్తాం
కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఇళ్ల స్థలాల సాధన
సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్
విశాలాంధ్ర : భారత కమ్యూనిస్ట్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గం, పట్టణ సమితుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రి వర్గం సమావేశంలో తీర్మానం చేసి, జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఐ జిల్లా కార్యదర్శి దో నేపూడి శంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి పక్షాన ఎర్ర జెండా పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఇనాం భూముల్లో ఉన్న వారికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేసారు.
కూటమి ప్రభుత్వం కమ్యూనిస్టుల పోరాటం వల్లనే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. జగ్గయ్యపేట మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజలతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కి అర్హులైన ఇండ్ల స్థలాల లబ్దిదారులతో అర్జీలను అందించడం జరిగిందని అన్నారు. సుమారు వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి ఆంబోజి శివాజి, పట్టణ కార్యదర్శి జూనె బోయిన శ్రీనివాస రావు తదితరులు ప్రసంగించ్చారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠo శివప్రసాద్, సీపీఐ ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి పోతుపాకవెంకటేశ్వర్లు,పట్టణ సహాయ కార్యదర్శులు మాశెట్టి రమేష్ బాబు, అసదుల్లా, ఎన్టీఆర్ జిల్లా ఏఐ వై ఎఫ్ అధ్యక్షులు కరిసే మధు, వత్సవాయి మండల సిపిఐ కార్యదర్శి జానీ ,నాయకులు మెటికల శ్రీనివాసరావు, భోగ్యం నాగులు, ఎండ్రపల్లి భాను,మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.