Wednesday, November 27, 2024
Homeజిల్లాలుఅనంతపురంరాజ్యాంగంలోని పీఠిక  ఒక పవిత్ర గ్రంథం

రాజ్యాంగంలోని పీఠిక  ఒక పవిత్ర గ్రంథం

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం  ఆధ్వర్యంలో నిర్వహించిన  భారత రాజ్యాంగ దినోత్సవం  సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని పీఠిక  ఒక పవిత్ర గ్రంథం అని,భారతదేశంలో  మనం పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యఫలం,మన తల్లిదండ్రులు  చేసిన పుణ్యంతో మనం జన్మించామని అన్నారు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని   జిల్లాలు పర్యటించానని భారతదేశంలో  24 రాష్ట్రాలు పర్యటించానని, ఐదు నుండి ఏడు దేశాలను పర్యటించాలని వేరే దేశాలలో పర్యటించినప్పుడు  మనం గమనిస్తే వివిధ రకాల ఆంక్షలు  ఉంటాయని, అది మన భారతదేశంలో  మనం ఎంత  స్వేచ్ఛతో, ఆనందంగా  ఉన్నామని తెలుస్తుందని అన్నారు.  హక్కుల,స్వేచ్ఛగా,ఆనందంగా ఉండ కలిగి మన భారత దేశం అని అన్నారు.  దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం అని అదేవిధంగా ఈరోజు   రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలను నేరుగా జిల్లా కలెక్టర్ గా ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆ దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడని,  ఈ విషయంలో గర్వపడే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా  డిఆర్ఓ ఏ.మలోల మాట్లాడుతూ… భారత దేశం లక్షలాదిమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమని స్వతంత్రం వచ్చిన మనం మనలను పాలించుకోవడానికి అవకాశం వచ్చిందని అన్నారు.  గతంలో చాలా దేశాలలో వివిధ రకాల పాలనలను గమనించి,  పరిశీలించడం జరిగిందని ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి  న్యాయ,  స్వేచ్ఛ,సమానత్వం హక్కులు   కల్పించాలని ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తయారు చేసినది  భారత రాజ్యాంగం పీఠిక  అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారి చేత  ప్రతిజ్ఞ చేయించారు . ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల,డిపిఎం ఆనంద్, కలెక్టర్ కార్యాలయం ఏ ఓ అలెగ్జాండర్,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి,  ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, జిల్లా టూరిజం అధికారి  జయ కుమార్ బాబు , ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ పి.గురుస్వామి శెట్టి, మెజిస్టీరియల్ విభాగం సూపరింటెండెంట్ వసంతలత, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు