Wednesday, April 2, 2025
Homeజిల్లాలుఅనంతపురంకల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

అధికారి కి వినతి పత్రం అందజేసిన ఏపీ కల్లుగీత పనివారుల సంఘం నాయకులు
విశాలాంధ్ర- అనంతపురం : కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రొహిబిషన్ డ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి కి ఏపీ కల్లుగీత పనివారుల సంఘం ఆధ్వర్యంలో ఏపీ చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి లింగమయ్య, ఆంధ్రప్రదేశ్ కల్లు గీత పనివారల సంఘం ఈ. సంగమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. రఘు బుధవారం జిల్లా ప్రొహిబిషన్ డ ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అఖిల భారత కళ్ళు గీత పనివారల సంఘము అనుబంధము మేము అనంతపురము జిల్లా మండలాలు యందు కల్లుగీత కార్మికులను కలిసినప్పుడు మా దృష్టికి గుర్తింపు కార్డు ఎన్నిమార్లు అడిగినా ఇవ్వడము లేదన్నారు. ఒకసారి ఎక్సైజ్ వారిని కలిసి మాకు గుర్తింపు కార్డులు ఇప్పించమని కోరారు. అలానే జిల్లాలో ఈత వనాలు అంతరించిపోతున్నాయి అన్నారు. మాకు గవర్నమెంట్ ఈత విత్తనాలు సప్లయ్ చేయాలన్నారు.. మీరు ఈత వనాలను గుర్తించి ఈత విత్తనాలు సప్లయ్ చేయాలన్నారు . ఎక్కడైనా టి ఎఫ్ టి లైసెన్సు అప్లయ్ చేసుకుంటే మాకు కల్లుగీత టెస్టింగ్ పెట్టి మమ్ములను గుర్తించి మాకు టి ఎఫ్ టి లైసెన్సు ఇవ్వాలన్నారు. టి సి ఎస్ లో మెంబర్షిప్ కోరిన యెడల వారిని గుర్తించి వారికి కూడా టెస్టింగ్ పెట్టి వారిని గుర్తించి టి సి ఎస్ లో మెంబర్గా చేర్చాలన్నారు. గీత కార్మికులకు పనిముట్లు ఇవ్వవలసినదిగా కోరారు. మా సమస్యలు న్యాయబద్ధమైనవి కావున తమరు మా కల్లు గీత కార్మికులకు అడిగిన సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చేతివృత్తిదారుల జిల్లా కార్యదర్శి సి. వి. హరికృష్ణ, నాగప్ప, కల్లుగీత పనివాళ్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ. సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు