ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 15వ తేదీ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం నమోదు కావడం జరిగిందని, మొత్తం డివిజన్ పరిధిలో 264.8 మిల్లీమీటర్లు రావడం జరిగిందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ధర్మవరంలో 71.6 మిల్లీమీటర్లు, బత్తలపల్లి లో 36.2, తాడిమర్రిలో 41.2, ముదిగుబ్బలో 12.6, కనగానపల్లి లో 75.2, చెన్నై కొత్తపల్లిలో 16.2, రామగిరిలో 11.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. వర్షం రెవెన్యూ డివిజన్ పరిధిలో కురిసినప్పుడు ఏదైనా పంట నష్టం, ఇల్లు కూలిపోవడం తదితర సమస్యలను ఆయా మండల తాసిల్దారులకు సమాచారాన్ని అందించాలని తెలిపారు.
ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో వర్షపాతం అధికం..
RELATED ARTICLES