.. ప్రిన్సిపాల్ చంద్రకళ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పోట్ల మరి గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలోను ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలోను అత్యుత్తమ ప్రతిభను విద్యార్థినిలు కనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో 31 మంది విద్యార్థులకు గాను 29 మంది ఉత్తీర్ణత చెంది 95 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో కె. తనుజా లక్ష్మి 899 మార్కులు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో 38కు గాను 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణత చెందగా 53 శాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఇందులో కే భార్గవి 385 మార్కులతో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 37 మంది విద్యార్థినీలకు గాను 32 మంది ఉత్తీర్ణత చెందడం జరుగగా శాతం నమోదు కావడం జరిగిందన్నారు. బి అభినయశ్రీ 564 మార్కులతో అత్యధికంగా సాధించడం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ, ఇంటర్ పరీక్ష ఫలితాలలోప్రతిభ
RELATED ARTICLES