Friday, February 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసమాజాన్ని అభివృద్ధి పరచడంలో జర్నలిస్టుల యొక్క పాత్ర ఎంతో కీలకం...

సమాజాన్ని అభివృద్ధి పరచడంలో జర్నలిస్టుల యొక్క పాత్ర ఎంతో కీలకం…

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : సమాజాన్ని అభివృద్ధి పరచడంలో జర్నలిస్టులు యొక్క పాత్ర ఎంతో కీలకమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి. సుబ్బారావు, ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు సిఎన్బి కళ్యాణ మండపంలో ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం రెవెన్యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విస్కృతస్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు పుల్లయ్య, ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అంతేకాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏపీయూడబ్ల్యూజే నాయకులు సభ్యులు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని, రాష్ట్ర సమాజాభివృద్ధికి పాత్రికేయులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రావాలని వారు తెలిపారు. అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సమాజ పోరాట యోధులు జర్నలిస్టులు అని సమాజంలో మార్పులు తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టులు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో ముఖ్యమైన ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పత్రికా మీడియా రంగం ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలన్నీ తెలిపారు. ప్రజల సమస్యలను పాలకులకు, ప్రభుత్వానికి సమాచారాన్ని అందించి పరిష్కరించడంలో వారికి వారే సాటి అని తెలిపారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను వెలికి తీయడంలో పత్రికలదే ప్రధాన పాత్ర అని వారు స్పష్టం చేశారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పత్రికలు ఎంతో కృషి చేశాయని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా పాత్రికేయులు పనిచేస్తూ, సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధ్యతలను నిర్వర్తించడంలో కీలకపాత్ర వ్యవహరించడం జరిగిందని తెలిపారు. జర్నలిస్టులు అందరూ కూడా రాసే వార్తలు నిజరూపంలో ఉండాలని, అప్పుడే ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ప్రజలే జర్నలిస్టులను గుర్తించడం జరుగుతుందని, మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో విలేకరుల మీద దాడి జరిగిన పట్టించుకోలేదని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ తగిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. జర్నలిస్టులకు హెల్త్ స్కీం ద్వారా వైద్య సేవలు, ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు కింద 25 లక్షల స్కీము అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయులకు రైల్వే పాసులు లేవని మాకు తెలిసిందని, ఈ సమస్యను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి తప్పక పరిష్కరించడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని వారు హామీ ఇచ్చారు. పాత్రికేయులకు ఇచ్చే అక్రిడేషన్ల సమస్యపై కూడా తాము మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకొని వెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ఇల్లు నిర్మిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం భౌతిక దాడులు వంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని తెలిపారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రిడేషన్ను ఇచ్చేలా కొత్త జీవోను జారీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఉన్నా కూడా వివిధ ఆసుపత్రులలో వైద్యం అందలేదన్న ఫిర్యాదు మాకు అందిందని, అలా కాకుండా అందరికీ వైద్యం అందేలా చూస్తామని తెలిపారు. సమాజంలో జర్నలిస్టులకు ఎంతో గౌరవము గుర్తింపు ఉన్నప్పటికీ వారి సమస్యలు తీరలేకపోవడం బాధాకరమైన, వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందని తెలిపారు. తదుపరి పరిటాల శ్రీరామ్ ధర్మవరం డివిజన్ కమిటీ సంక్షేమానికి ఒక లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను అవినీతి అక్రమాలను వెలికితీస్తూ సమాజం కోసం పాటుపడుతున్న పాత్రికేయులకు కూటమి ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందని తెలిపారు. తదుపరి మంత్రి తోపాటు పరిటాల శ్రీరామ్ చిలక మధుసూదన్ రెడ్డి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావుతో పాటు పలువురు జిల్లా డివిజన్ కమిటీ నాయకులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహకరించిన దాతలైన గొర్తి సుధాకర్ నాయుడు వారి భార్య గోర్తి భారతీదేవిలను కూడా ఘనంగా కమిటీ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్ తో పాటు ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే అనంతపురం కర్నూలు జిల్లాల అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ రాజు, కర్నూలు జిల్లా విశాలాంధ్ర బ్రాంచ్ మేనేజర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీవీ నారాయణ ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసులు, ఎలక్ట్రానిక్ మీడియా సత్యసాయి జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ అధ్యక్షులు జానపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి జాంపుల అజయ్ కుమార్, జిల్లాలోని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు