Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

చలికాలం మొదలుకావడంతో ఢిల్లీలో పొగమంచు రోజు రోజుకు ఎక్కుఅవుతుంది. వాతావరణంలో పెరిగిన కాలుష్యంతో కలిపిన ఈ పొగమంచు పర్యావరణానికి ముప్పును కలిగిస్తోంది. దట్టమైన పొగమంచుతో నగరం నిండిపోవడంతో వాహనదారులకు విజిబిలిటీ గణనీయంగా తగ్గింది, దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. విమాన సర్వీసులు, రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (జూజదీ) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు నాణ్యతా సూచిక (AూI) 473గా నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని తెలిపింది. శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీని ఫలితంగా రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటల సమయంలో కూడా సూర్యుడు కనిపించకపోవడం, విజిబిలిటీ సున్నాకి చేరుకోవడం, వాతావరణం మరింత దారుణంగా మారినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితులు ఢిల్లీ విమానాశ్రయం ఆపరేషన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. 300కి పైగా విమానాలు ఆలస్యమవుతున్నాయి. మరికొన్ని దారిమళ్లించలసి వస్తుంది. ఢిల్లీలోకి రావాల్సిన 115 విమానాలు, ఢిల్లీలోనుండి బయలుదేరాల్సిన 226 విమానాలు సగటున 17 నుంచి 54 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఈ పొగమంచు ప్రభావంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది ప్రయాణికుల కోసం మరింత ఇబ్బందికరంగా మారింది.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన పంట కాల్చే ప్రక్రియ, పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల కాలుష్యం పొగమంచుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు చలికాలం గాలుల తక్కువ వేగం వల్ల పొగమంచు కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు