వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య
విశాలాంధ్ర- అనంతపురం : గొర్ల కాపరి రామలింగ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్ల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్ల పోతులయ్య, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య లు మాట్లాడుతూ… బుధవారం గొర్ల కాపరు గొర్రెలను చూసుకుంటూ సాయంత్రం ఐదు గంటలకు వర్షం రావడంతో చెట్లుంటే చెట్టు కిందకు పోవడంతో ఉరుములు, మెరుపులతో, పిడుగు పడి గొర్ల కాపరి గొర్లన్నీ ఎక్కడ పోతాయని దాన్ని చూసుకుంటూ ఆ పిడుగు పడటంతో అక్కడ అబ్బాయి రాము లింగయ్య అక్కడికక్కడే మృతి చెందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొర్ల కాపరిని కుటుంబాన్ని తల్లిదండ్రులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు. గొర్ల కాపరికి 10 లక్షల రూపాయలు ఎక్స్రేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు సి నాగప్ప, గీత పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి రఘు, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.