– యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపీ జయ చంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా నందు పదవ తరగతి ఇన్విజిలేషన్ విధులలో సస్పెండ్ అయిన ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఎత్తివేసి విధులలోకి చేర్చుకోవాలని యుటిఎఫ్ జిల్లా పక్షాన రాష్ట్ర కార్యదర్శి , జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రోజున స్థానిక యుటిఎఫ్ నాయకులతో కలసి ధర్మవరం పట్టణంలోనీ ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కిష్టప్ప ని కలసి యుటిఎఫ్ పక్షాన వినతిపత్రం అందజేశారు. అనంతరం
ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ కదిరి పట్టణంలో ఇద్దరు, ముదిగుబ్బ పట్టణంలో ఒక ఇన్విజిలేటర్ లని సస్పెండ్ చేయడం జరిగిందని, ఆ ఉపాధ్యాయుల సస్పెన్షన్ని ఎత్తివేయాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఇతర అంశాలలో పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్ కాలాన్ని కూడా త్వరితగతిన విచారించి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్లు ఎత్తివేసి, వారిని విధులలోకి తిరిగి చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారూ.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు రామకృష్ణ నాయక్, సకల చంద్రశేఖర్, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి, బిల్లే రామాంజనేయులు, ఆదిశేషు, వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్విజిలేటర్ల పై సస్పెండ్ వెంటనే రద్దు చేయాలి
RELATED ARTICLES